Kavitha: కుట్ర చేసి బయటకు పంపారు.. నా దారి నేను వెతుక్కుంటున్నా: కవిత

నిజామాబాద్: గత 20 ఏళ్లుగా కేసీఆర్, భారత రాష్ట్రసమితి పార్టీ కోసం పని చేశానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ‘ జాగృతి జనం బాట’ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. ‘‘ఇంటి గుట్టు బయటపెట్టి.. కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా. ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా. 27 ఏళ్ల వయస్సులో ఉద్యమంలోకి వచ్చా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశా.
నేను భారత రాష్ట్రసమితి పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. కానీ, కుట్ర చేసి నన్ను బయటకు పంపించారు. ఏం కుట్ర జరిగిందో పిల్లల్ని అడిగినా చెబుతారు. ఎన్ని అవమానాలు జరిగినా భరించాను. ఈ సమయంలో ఆశీర్వాదం కావాలని మీ ముందుకొచ్చా. తొలి అడుగు మన గడ్డ మీద నుంచే వేయాలని వచ్చాను. గత 10 ఏళ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ, అమర వీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదు. వాటికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడతాను. అందర్నీ భాగస్వాములను చేస్తాను. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా’’ అని కవిత అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                గేలి చేసిన మాటలే..గెలుపు చూపిన బాటలై
[ 04-11-2025]
ఆడపిల్లలకు ఆటలెందుకని గేలి చేశారు. సొంత కుటుంబ సభ్యులూ అభ్యంతరాలు తెలిపారు. అయితేనేం.. ఆ యువతులు నాన్న చూపిన బాటలో, ఆసక్తిగల క్రీడల్లో విజయాలెన్నో అందుకున్నారు - 
                            
                                
                                దారి కాస్తున్న.. మృత్యు శకటాలు
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సు ను ఢీకొనడంతో తీవ్ర విషాదం నెలకొంది. అమాయకుల ప్రాణాలు కంకర కుప్పల్లో నలిగిపోగా, దుర్ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది - 
                            
                                
                                సౌర వెలుగులకు సై..
[ 04-11-2025]
సోలార్ విద్యుత్తు వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి సూర్యఘర్, ముఫ్త్ బిజిలి యోజన పథకంలో భాగంగా పల్లెల్లో సౌరఫలకల ఏర్పాటుకు కృషి చేస్తోంది. - 
                            
                                
                                అక్రమార్కులకు కలపవృక్షం
[ 04-11-2025]
గాంధారి మండలంలోని అటవీ భూములను అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. వ్యవసాయ భూములను ఆనుకొని ఉన్న అటవీ స్థలాల్లోని భారీ వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు. - 
                            
                                
                                వాహనం కొంటున్నారా ..జాగ్రత్త !
[ 04-11-2025]
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం కోరలు చాసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్లచేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం 15 ఏళ్లు దాటిన కార్లు, ఇతర వాహనాలపై ఆంక్షలు విధిస్తోంది. కాలపరిమితి ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయెద్దని ఆదేశించింది. - 
                            
                                
                                ‘ఆధార్’కు అదనపు వసూళ్లా..
[ 04-11-2025]
విద్య, ఉద్యోగం, పథకాల్లో అర్హత.. ఇలా ఏ అవసరమైనా ఈ రోజుల్లో ఆధార్ కార్డు తప్పనిసరి అవుతోంది. వాటిలో ఏదైనా తప్పు దొర్లితే పలు ప్రయోజనాలు, వివిధ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 


