Finland: ప్రపంచంలో నెక్ట్స్‌ సూపర్‌ పవర్‌గా భారత్‌: ఫిన్లాండ్‌ అధ్యక్షుడు

Eenadu icon
By International News Team Updated : 04 Nov 2025 13:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిన్లాండ్‌ (Finland) అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌ భారత్‌ (India)పై ప్రశంసలు కురిపించారు. అమెరికా, చైనాలతో పాటు ప్రపంచంలో తదుపరి సూపర్‌ పవర్‌గా భారత్‌ నిలవనుందన్నారు. ఇదే క్రమంలో ప్రపంచశక్తిగా ఎదుగుతోన్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టబ్‌ (Alexander Stubb) ఈ వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌కు గొప్ప అభిమానినని పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల్లో భారత్ అనుసరిస్తున్న విధానాలు సరైనవేనన్నారు. ఈ సందర్భంగా యూఎన్‌ వంటి వేదికపై భారత్‌ వంటి దేశాల పాత్ర ఉండాలని స్టబ్‌ అన్నారు. యూఎన్‌ భద్రతా మండలిని విస్తరించాలని జనరల్‌ అసెంబ్లీలో రెండుసార్లు పేర్కొన్నట్లు వెల్లడించారు. అందులోని సభ్యత్వాలను పెంచాలన్నారు. భారత్‌ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరైనది కాదన్నారు. లాటిన్‌ అమెరికా నుంచి ఒక సభ్యుడు, ఆఫ్రికా నుంచి ఇద్దరు.. ఆసియా నుంచి ఇద్దరు సభ్యులు ఉండాలని స్టబ్‌ సూచించారు. భారత్‌కు అందులో స్థానం లేకపోతే ఆ సంస్థ మరింత బలహీనపడుతుంది అని స్టబ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :
Published : 04 Nov 2025 13:32 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు