TSRTC: టీఎస్‌ఆర్టీసీకి మరో 80 కొత్త బస్సులు.. ప్రారంభించిన మంత్రి పొన్నం

తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు) అందుబాటులోకి వచ్చాయి.

Updated : 30 Dec 2023 13:04 IST

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు) అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. సంస్థ ఎండీ సజ్జనార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని