ACB Raids: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు!

రాష్ట్రంలోని పలుచోట్ల ఆర్టీవో కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

Updated : 28 May 2024 16:27 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆర్టీవో కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మలక్‌ పేట, పాతబస్తీ బండ్లగూడ, టోలిచౌకి, నల్గొండ జిల్లాకేంద్రంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దరఖాస్తుదారుల్ని నిలిపివేశారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఐదుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీవో గౌస్‌ పాషా డ్రైవర్‌ సుబ్బారావు వద్ద రూ.16,500 నగదు, రెన్యువల్స్‌, ఫిట్‌నెస్‌ పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.4,500, నూతన లైసెన్సులు, ఫిట్‌నెస్‌ పత్రాలు గుర్తించారు. కౌంటర్లలోని ఉద్యోగుల వద్ద కూడా లెక్కలు చూపని నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని