Agnibaan: అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా మంగళవారం ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది.

Updated : 28 May 2024 09:09 IST

శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా మంగళవారం ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని