కార్టూన్లందు.. అమూల్‌ కార్టూన్లు‌ వేరయా!

అమూల్‌.. పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థ. అమూల్‌ పేరు చెప్పగానే ఆ బ్రాండ్‌పై కనిపించే అమూల్‌ గర్ల్‌ గుర్తొస్తుంది. అందుకే, ఈ సంస్థ దేశంలో.. ప్రపంచంలో జరిగే విషయాలను అమూల్‌ బేబీతో కలిపి ప్రత్యేక కార్టూన్లు రూపొందించి ట్విటర్‌లో పోస్టు

Updated : 09 Nov 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే అమూల్ సంస్థ‌ పేరు చెప్పగానే ఆ బ్రాండ్‌పై కనిపించే అమూల్‌ గర్ల్‌ గుర్తొస్తుంది. ఈ సంస్థ దేశంలో.. ప్రపంచంలో జరిగే ఘటనలు, సందర్భానుసరంగా అమూల్‌ గర్ల్‌తో కలిపి ప్రత్యేక కార్టూన్లు రూపొందించి ట్విటర్‌లో పోస్టు చేస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో గోల్స్‌ విషయంలో పీలే(770 గోల్స్‌)రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. దానికి సంబంధించి పీలే, రొనాల్డో, అమూల్‌ గర్ల్‌ వెన్న పట్టుకొని నిల్చున్న కార్టూన్‌ను అమూల్‌ ట్వీట్‌ చేసింది. అంతకుముందు నటుడు ఆదర్శ్‌ గౌరవ్‌ బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులకు నామినేట్‌ అయిన సందర్భంగా కార్టూన్‌ పోస్టు చేసింది. అలాగే, టీమిండియా పేసర్‌ బుమ్రా వివాహం సందర్భంగా పెళ్లిపీటలపై కూర్చున్న ఆ దంపతుల కార్టూన్‌ను, ప్రిన్స్‌ హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించిన నేపథ్యంలో వారి కార్టూన్‌ను అమూల్‌ తమదైన శైలిలో రూపొందించి, కాప్షన్స్‌ పెట్టింది. అలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో అమూల్‌ పోస్టు చేసిన కార్టూన్లను చూద్దామా??Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు