Annavaram: అన్నవరంలో భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ

కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణ కొనసాగుతోంది.

Updated : 27 Nov 2023 10:54 IST

అన్నవరం: కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కొండ దిగువల తొలి పావంచాల వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల కోలాహలం నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గిరిప్రదక్షిణకు రత్న, సత్యగిరుల చుట్టూ సుమారు 8.5 కిలోమీటర్ల మేర మార్గాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. అన్నవరం గ్రామంలోని జాతీయ రహదారి మీదుగా సుమారు 3.5 కిలోమీటర్లు తారురోడ్డు.. ఆ తర్వాత పోలవరం కాలువ గట్టు నుంచి పంపా ఘాట్‌ వరకు సుమారు 5 కిలోమీటర్లు మట్టిరోడ్డులో గిరిప్రదక్షిణ కొనసాగుతోంది. జాతీయ రహదారిపై ప్రదక్షిణ సాగే సమయంలో విశాఖ-రాజమహేంద్రవరం మార్గంలోనే వాహనాలు అనుమతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని