Andhra news: డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు: ఈసీ

ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు.

Updated : 16 Apr 2024 18:48 IST

అమరావతి: ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా ఎస్‌హెచ్‌జీ బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, బృందంగా డ్వాక్రా సంఘాలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దని తేల్చి చెప్పారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సెర్ప్‌ సీఈవో, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌లకు ఆదేశాలిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని