Andhra news: పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదే: సూర్యనారాయణ

పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. 

Published : 28 May 2024 20:19 IST

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి ఉద్యోగులు బాధ్యతగా ఓటు వేశారని, ఆ ఓటు చెల్లదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని ఎందుకింత సంక్లిష్టంగా మారుస్తున్నారని మండిపడ్డారు.

సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ సమంజసమేనా?అని నిలదీశారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఓటు హక్కు చెల్లుబాటయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని