చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ

తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 03 Nov 2023 13:02 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తీర్పు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని