AP High court: ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Published : 24 Apr 2024 16:22 IST

అమరావతి: పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 తెదేపా సానుభూతి కుటుంబాలను 2019లో రాజకీయ కక్షలతో వైకాపా నేతలు గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన వారు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తమపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేశారని,  గ్రామంలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెదిరింపులు తాళలేక ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్‌, ముప్పాల బాలకృష్ణ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని