Attack: తెదేపాలో చేరాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరానని.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తనపై కక్షగట్టారని బాధితుడు ఆరోపించాడు.

Published : 31 Mar 2024 11:32 IST

మందస: శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరానని.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తనపై కక్షగట్టారని బాధితుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే.. మందస మండలం గౌడు గురంటికి చెందిన గాడి దేవరాజు ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కింద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం వేకువజామున స్వగ్రామం నుంచి విధుల కోసం బైక్‌పై బయలుదేరారు.

ఈ క్రమంలో బుడార్సింగి సమీపంలో కొందరు మాటువేసి తనపై కర్రలతో దాడికి పాల్పడ్డారని బాధితుడు చెప్పాడు. దాడి చేసిన వారిలో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు ఉన్నారని తెలిపాడు. తెదేపాలో చేరినందుకు కక్షగట్టి వైకాపా నేతలే దాడి చేయించారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ మందస పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించాడు. గాయాలు కావడంతో చికిత్స కోసం అతడిని హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష బాధితుడిని ఓదార్చారు. దేవరాజుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆమె కంటతడిపెట్టారు. నిందితులపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని