Viral video: దీనస్థితిలో తల్లి ఏనుగు.. కాపాడిన అటవీ అధికారులు!

Viral video: వన్యప్రాణులకు సంబంధించిన మరో వీడియోను పంచుకున్నారు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 01 Jun 2024 00:13 IST

Viral video | ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్యప్రాణులకు సంబంధించిన అద్భుతమైన వీడియోలు పంచుకుంటుంటారు ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు. తప్పిపోయిన ఏనుగు పిల్లను తల్లితో కలపడం, అరణ్యంలో ఏనుగులు చేసే పనులకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇదే తరహాలో తాజాగా ఆమె పంచుకున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది. ఆరోగ్యం సహకరించక ఓ తల్లి ఏనుగు లేవలేని స్థితిలో ఉంటే రెస్క్యూ టీం కాపాడిన విషయాన్ని ఆమె ‘‘ఎక్స్‌’’ వేదికగా షేర్‌ చేశారు.  

అనారోగ్యం కారణంగా ఎటూ కదల్లేని దైన్యస్థితిలో పడి ఉందో తల్లి ఏనుగు. అక్కడే దాని చుట్టూ ఓ గున్న ఏనుగు నిస్సహాయంగా చూస్తోంది. దీన్ని గమనించిన ఫారెస్ట్‌ డివిజన్‌ బృందం ఎలాగైనా దానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా 24 గంటలు నిర్విరామంగా శ్రమించి క్రేన్‌ సాయంతో దాన్ని నిలబెట్టారు. వెంటనే అవసరమైన అన్ని చికిత్సలు అందించారు. ఇలా తల్లి ఆనందంగా ఉండటం చూసి గున్న ఏనుగు ఎంతో ఆనంద పడింది. ఇలా తల్లి ఏనుగు ఆహారం తీసుకుంటుంటే గున్న ఏనుగు తల్లి వద్దకు వచ్చి ఆనందంతో చూస్తోంది. హృదయాలను కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’వేదికగా పంచుకున్న సుప్రియా సాహు.. అటవీ శాఖ అధికారుల కృషిని కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు