పాడుబడిన ఇంట్లోకి ఎలుగుబంటి.. పరుగులు తీసిన స్థానికులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడింది.

Published : 02 Apr 2024 11:02 IST

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడింది. మంగళవారం తెల్లవారు జామున వెళ్లి అందులో చిక్కుకుంది. గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పరిసరాల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటి బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య, అటవీ బృందాల సాయంతో బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని