Viral Video: జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌.. నెట్టింట వీడియో ట్రెండింగ్‌

Viral Video: జీరో- వేస్ట్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది.

Published : 08 Jun 2024 00:09 IST

Viral Video | ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్న వేడుక చేసుకోవాలన్నా ప్లేట్లు, గ్లాసులని ఎక్కడో ఒకచోట ప్లాస్టిక్‌ను వాడుతుంటాం. ఇక వివాహం జరిపించాలంటే ఈ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మండపం అలంకరణ దగ్గర నుంచి అతిధులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు అన్నింటా ఎక్కువగా ప్లాస్టిక్‌నే వినియోగిస్తాం. దీంతో వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోతున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్‌ ఉత్పత్తులను వినియోగించకుండా తన వివాహం జరుపుకోవాలని ఓ మహిళ నిర్ణయించుకుంది. తన తల్లి సాయంతో అనుకున్నది సాధించింది.

బెంగళూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్‌కు తన పెళ్లిని జీరో- వేస్ట్‌గా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి తన తల్లి సహకారాన్ని తీసుకుంది. అంతే అలంకరణ దగ్గర నుంచి భోజనాలు వడ్డించే అరటాకుల వరకు మొత్తం ఎక్కడా ప్లాస్టిక్‌ వాడకుండా వేడుకను జరుపుకుంది. మండపాన్ని చెరకుగడలతో ఎంతో అందంగా సిద్ధం చేయించింది. కొబ్బరి ఆకులతో అలంకరణ, అరటి ఆకుల్లో భోజనం, ఇక పూలమాలల్లో కూడా ప్లాస్టిక్‌ పువ్వులు వాడకుండా సహజమైన పువ్వులు, పత్తి దారాలు మాత్రమే తయారుచేయించింది. ఇలా అడుగడుగునా ప్రకృతి నుంచి వచ్చిన వాటితో వేడుకను జరుపుకుంది. ఇలా తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను ఆ డాక్టర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అంతే ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్‌ నుంచి రైలు

నిపుణులు జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌గా దీన్ని పరిగణిస్తారో, లేదో తెలియదు కానీ ఇరు కుటుంబాల సహకారంతో ఎటువంటి వ్యర్థాలు లేకుండా వివాహం జరుపుకోవడంపై ఆనందం వ్యక్తంచేసింది. ఈ వీడియోలో అసలు ప్లాస్టిక్‌ వస్తువులే కనిపించకపోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘మన పూర్వీకులు ఇలానే వివాహాలు జరుపుకొనేవారు. నేను కూడా ఇలానే చేసుకుంటా’’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘‘మీరు జీరో వేస్ట్ వెడ్డింగ్‌ కోసం చాలా శ్రమించారని స్పష్టంగా తెలుస్తోంది’’ అంటూ మరో యూజర్‌ రాసుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని