BRS: వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన: ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

భారాస నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు.

Published : 27 May 2024 16:17 IST

హైదరాబాద్‌: భారాస నేత శ్రీధర్‌రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్‌రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. 

‘‘హత్య జరిగి నాలుగు రోజులైనా, మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. ప్రధాన నిందితుడి ఇంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం పెట్టారు. ముఖ్యమంత్రే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు. అందుకే, శ్రీధర్‌రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డీజీపీని కోరాం. వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’అని ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని