అమ్మాయి.. గుర్రంలా గంతులేస్తోంది!

గుర్రపు పందాలను ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూసే ఉంటారు. గుర్రాలపై జాకీలు కూర్చొని వాటిని పరుగెత్తిస్తుంటారు. కొన్ని రేసుల్లో మధ్యమధ్యలో కంచెలుంటాయి. వాటిపై గుర్రాలు దూకాల్సి ఉంటుంది. అలా గుర్రాలు వాటిపై నుంచి గంతులేస్తూ పరిగెడుతూ చేసే విన్యాసాలు 

Published : 05 Oct 2020 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుర్రపు పందేలను ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూసే ఉంటారు. గుర్రాలపై జాకీలు కూర్చొని వాటిని పరిగెత్తిస్తుంటారు. కొన్ని రేసుల్లో మధ్యమధ్యలో కంచెలుంటాయి. వాటిపై గుర్రాలు దూకాల్సి ఉంటుంది. అలా గుర్రాలు కంచెలపై నుంచి దూకుతూ.. పరిగెడుతూ చేసే విన్యాసాలు భలే ఉంటాయి. కానీ, ఎప్పుడైనా మనిషే గుర్రంలా పరిగెత్తడం, కంచెలపై నుంచి దూకడం చూశారా? కెనడాకి చెందిన పదిహేడేళ్ల ఓ అమ్మాయి ఆ విన్యాసం చేసి చూపిస్తోంది. కాళ్లతోపాటు రెండు చేతుల్ని నేలపై ఉంచి గుర్రంలా పరుగెడుతూ.. కంచెలపై నుంచి దూకుతూ వార్తల్లోకెక్కింది. 

కెనడాలోని ఎడ్మోంటన్‌కు చెందిన ఎవా వొగెల్‌ చిన్ననాటి నుంచే హై జంప్‌ చేయడం సాధన చేసింది. పదేళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే తన గుర్రం కంచెలపై నుంచి జంప్‌ చేసే విధానం గమనించిన ఎవా తను కూడా గుర్రంలా జంప్‌ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. గత మూడేళ్లుగా గుర్రంలాగా జంప్‌ చేయడం ప్రాక్టీస్‌ చేస్తోంది. ప్రస్తుతం కంచెలపై సునాయాసంగా జంప్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ‘జంపింగ్‌ లైక్‌ ఎ హార్స్‌’ వీడియోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటోంది. ఎవా విన్యాసాలను మీరూ చూసేయండి..
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని