Viveka Murder case: ఉదయ్‌ కుమార్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు.. అవినాష్ ప్రమేయమూ ఉంది: సీబీఐ

వివేకా హత్య కేసులో ఉదయ్‌ కుమార్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే అరెస్టు చేశామని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.  ఈమేరకు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేస్తూ బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది.

Updated : 11 May 2023 15:22 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన డైరీని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ సందర్భంగా కేసులో ఏ6గా ఉన్న గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. హత్య కేసులో ఉదయ్ కుమార్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది. హత్య కేసులో ఉదయ్‌ కుమార్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే అరెస్టు చేశామని కోర్టుకు వివరించింది. ఈ మేరకు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేస్తూ బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్‌ పిటిషన్‌పై ఉత్తర్వులను ఈనెల 15కు వాయిదా వేసింది. మరోవైపు వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్‌లో సీబీఐ పునరుద్ఘాటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని