CBI Court: జగన్‌, విజయసాయి విదేశీ పర్యటనలకు అనుమతిపై నిర్ణయం వాయిదా

విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 30 Aug 2023 17:50 IST

హైదరాబాద్‌: యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది.

మరోవైపు, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిందే. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా ఇవాళ వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. కోర్టును దృష్టికి తీసుకెళ్లింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని