Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశం

దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్‌ 22న విచారణ జరగనుంది.

Published : 15 Apr 2024 15:19 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టు చేయొద్దన్న నిబంధనలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలోనూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తనను అరెస్టు చేశారని, వెంటనే తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఈ నెల 20లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేసింది.

సోమవారం ఉదయం కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని