దిల్లీ మద్యం కేసు.. కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తమ కస్టడీలోకి తీసుకుంది.

Updated : 11 Apr 2024 16:05 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోనే ఈడీ ఆమెను అరెస్ట్‌ చేసింది. తిహాడ్‌ జైలులో ఉన్న కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది. తాజాగా కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని