Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి సమాధానం ఇచ్చారు.

Updated : 04 Dec 2023 18:23 IST

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి కౌశల్‌కుమార్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు వెల్లడించారు. అమరావతికి సైతం మాస్టర్‌ ప్లాన్‌ ఉందన్నఆయన.. దీనిని సైతం కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని