Medaram: జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదు: కిషన్‌రెడ్డి

మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, కానీ.. జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 22 Feb 2024 15:22 IST

ములుగు: మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, కానీ.. జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడారంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని, ఈ జాతరకి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. గురువారం ఆయన మేడారంలో సారలమ్మను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాదే ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడించారు. ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామన్నారు. వర్సిటీ భవనాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని