Andhra news: హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?

ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. 

Updated : 17 May 2024 17:52 IST

అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటుచేసినట్టు సమాచారం. దీనిపై ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ప్రతి ఘటనపైనా సిట్.. ఈసీకి నివేదిక ఇవ్వనుంది. దాడులకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశముంది. 

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న, కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద రెండంచెల నుంచి మూడంచెలకు భద్రత పెంచారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీ సీఈవో ఎంకే మీనా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు