అరకు కాఫీ ‘నచ్చిందండీ.. గర్వంగా ఉంది’: చంద్రబాబు ప్రశ్నకు భువనేశ్వరి జవాబు

‘నిజం గెలవాలి’ పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం అరకు నియోజకవర్గంలో పర్యటించారు.

Updated : 28 Feb 2024 19:47 IST

అమరావతి: ‘నిజం గెలవాలి’ పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం అరకు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి కాఫీ (Araku coffee)ని రుచి చూశారు. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర ఈ కాఫీ గొప్పతనాన్ని ఆమెకు వివరించారు. అనంతరం ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను భువనేశ్వరి పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు మరింత చొరవ తీసుకునేలా చంద్రబాబుకు వివరిస్తామని తెలిపారు. 

భువనేశ్వరి పర్యటన ఫొటోను చంద్రబాబు ‘ఎక్స్’ (ఇంతకుమునుపు ట్విటర్‌)లో పోస్ట్ చేస్తూ.. మన గిరిజన సోదరులు పండించిన అరకు కాఫీ ఎలా ఉందని సతీమణిని అడిగారు. దీనికి ఆమె ‘నచ్చిందండీ..!’ అని బదులిచ్చారు. ‘‘మన కిచెన్‌లో అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ.. అరకు సుందర అందాలు, ఇక్కడి ప్రజల ప్రేమతో ఇది మరింత రుచిగా మారింది. మీరు దీన్ని గ్లోబల్‌ బ్రాండ్‌గా మార్చినందుకు గర్వపడుతున్నా’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు