Chandrababu: ఎన్టీఆర్‌ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

Updated : 06 Jun 2024 11:45 IST

అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో రిప్లై పెట్టారు.

తనకు అభినందనలు తెలిపిన సినీనటుడు ఎన్టీఆర్‌ (NTR)కు చంద్రబాబు థాంక్స్‌ చెప్పారు. ఎక్స్‌(ట్విటర్‌)లో ఎన్టీఆర్‌ పెట్టిన పోస్ట్‌కు ‘Thank you very much Amma!’ అని రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు రజనీకాంత్‌, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, సోనూసూద్‌కు థాంక్స్‌ చెప్పారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తదితరులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని