Chiranjeevi: తెలుగుజాతికి తీరని లోటు.. మహా వ్యక్తిని కోల్పోయాం: చిరంజీవి

రామోజీరావు (Ramoji Rao)లో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని.. తాను మాత్రం చిన్న పిల్లాడిని చూశానని సినీ నటుడు చిరంజీవి అన్నారు.

Updated : 08 Jun 2024 17:17 IST

హైదరాబాద్‌: రామోజీరావు (Ramoji Rao)లో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని.. తాను మాత్రం చిన్న పిల్లాడిని చూశానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. 

‘‘రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహూకరించా. దాన్ని చూసి మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్‌ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు. ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు.. తెలుగు జాతికి తీరని లోటు. ఒక మహావ్యక్తిని, శక్తిని కోల్పోయాం’’ అని చిరంజీవి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని