Revanth Reddy: ఉప్పల్‌ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి, సినీ ప్రముఖుల సందడి..

ఉప్పల్‌ క్రీడా మైదానంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.

Updated : 06 Apr 2024 10:12 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ క్రీడా మైదానంలో సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సందడి చేశారు. హైదరాబాద్‌- చెన్నై మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. కుటుంబంతో కలిసి ఆయన మ్యాచ్‌ను తిలకించారు. రేవంత్ రెడ్డిని చూసిన క్రికెట్‌ అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ కేరింతలు కొట్టారు. అలాగే, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్‌, బ్రహ్మానందం, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, పట్నం సునీతా రెడ్డి పాటు పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను ఆస్వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని