CM Revanth: అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Updated : 15 Mar 2024 20:41 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ‘‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లు రద్దు చేయడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల్ల కాదు. రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత మాది. మైనారిటీ స్కూళ్లకు భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది’’ అని రేవంత్‌ తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని