CM Revanthreddy: కీరవాణి స్టూడియోకు సీఎం రేవంత్‌ .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు.

Published : 27 May 2024 00:07 IST

హైదరాబాద్‌: రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నందున అందుకు సంబంధించి ప్రముఖ కవి అందెశ్రీ, సంగీతదర్శకులు కీరవాణితో చర్చించేందుకు సీఎం.. స్టూడియోకు వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు.. చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండటంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి.. అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆ పాటను ఒకటికి రెండు సార్లు విని.. అందులోని అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో...గతంలో పది జిల్లాలు అన్నపదాన్నితొలిగించినట్లు సమాచారం. ఆ స్థానంలో పద పద అన్నపదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు