Revanth reddy: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీఎం రేవంత్‌.. అధికారులతో సమీక్ష

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. 

Updated : 25 May 2024 20:22 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సెక్యూరిటీ వింగ్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ వింగ్‌లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్‌ బ్యూరోకు బడ్జెట్‌ కేటాయించిన నేపథ్యంలో దానిపై చర్చించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఇతర విభాగాల అధికారులతోనూ సీఎం సమీక్ష చేపట్టారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించారు. పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణశాఖతో పాటు ఇతర విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని