Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర ఏర్పాట్లపై సీపీ సమీక్ష

అందరూ కలిసి పనిచేస్తే ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతం అవుతుందని హైదరాబాద్‌ నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Updated : 12 Apr 2024 14:30 IST

హైదరాబాద్‌: అందరూ కలిసి పనిచేస్తే ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతం అవుతుందని హైదరాబాద్‌ నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. వేడుకల సమయంలో నగరంలో మత సామరస్యం వెల్లివిరిస్తుందని చెప్పారు.

సమయం తక్కువగా ఉందని.. అధికారులు సెలవు రోజుల్లో కూడా పని చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు. తాగు నీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై చెత్త ఉండకుండా చూడాలన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బోనాలు, గణేశ్‌ ఉత్సవాలు, విజయదశమి పండగల నిర్వహణలో హైదరాబాద్‌ను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా శోభాయాత్ర ప్రారంభించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకూడదని, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని