అలాచేస్తే లక్షల కరోనా కేసులను ఆపవచ్చు!

కరోనా వైరస్‌ సంక్రమించిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించే కాలంలో (అంటుకాలం) ఒక్క రోజును వ్యాక్సిన్‌ కానీ, ఇతర మందులు కానీ ఆపగలిగితే లక్షల్లో కేసులను తగ్గించొచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Published : 08 Jan 2021 18:08 IST

దిల్లీ: కరోనా వైరస్‌ సంక్రమించిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించే వ్యవధిలో (అంటుకాలం) కనీసం ఒక్క రోజునైనా వ్యాక్సిన్‌ కానీ, ఇతర మందులు కానీ ఆపగలిగితే లక్షల్లో కేసులను తగ్గించొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సీయూఎన్‌వై గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన విద్యార్థులు ఈ పరిశోధనను నిర్వహించారు. పీఎల్‌ఓఎస్‌ కాంప్యుటేషనల్‌ బయాలజీ జర్నల్‌లో తాజాగా ఈ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం కొన్ని రకాల మందులు కొవిడ్‌ను పూర్తిగా నిరోధించలేకపోయినా, వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఆపే అవకాశముంది. వైరస్‌ లక్షణాలు తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స ఇవ్వడం ప్రారంభిస్తే ఇతరులకు వ్యాప్తి చెందటాన్ని నిరోధించొచ్చని ఈ పరిశోధనలో వెల్లడించారు. వైరస్‌ అంటు కాలాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే లక్షల్లో కేసులు తగ్గుతాయని తెలిపారు. ఈ పరిశోధనల ఫలితాలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఉపకరిస్తాయని పరిశోధకుల్లో ఒకరైన బ్రూస్‌ లీ అన్నారు. అంటువ్యాధులు ప్రబలినపుడు ప్రజలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటిని కట్టడి చేయడం వీలవుతుందని ఈ పరిశోధన వెల్లడిస్తోంది.

ఇవీ చదవండి..

భారత్‌ బయోటెక్‌ నుంచి మరో టీకా

దేశంలో 82 కరోనా కొత్త రకం కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని