Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated : 01 Dec 2023 12:38 IST

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది.

‘మిచౌంగ్‌’ ఎక్కడ తీరం దాటేనో..!

తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచన ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని