Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/09/21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 11 Sep 2021 06:03 IST

 - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన,వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. సంతోషకరమైన కాలం ఉంది. వస్త్ర,ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. శని ధ్యానం చేయండి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
 

మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

 

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవెంకటేశ్వరుని దర్శనం శుభప్రదం.  
 

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తోటివారితో వాదోపవాదాలు చేయకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని