Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/09/21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 16 Sep 2021 04:04 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యానశ్లోకం చదవండి.

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగించుకోవడానికి వేంకటేశ్వరుని పూజించాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

మీ తీరుతో అధికారులు సంతృప్తి చెందకపోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మీ రంగంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీదుర్గాధ్యానం శుభప్రదం.

శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి..మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

శుభఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. లక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని