Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Updated : 17 Mar 2024 08:40 IST

మేషం

కార్యసిద్ధి ఉంది. మంచి పనులను మొదలుపెడతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.

వృషభం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గురువుని ఆరాధించడం మంచిది.

మిథునం

మీమీ రంగాల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాల్లో  సొంత నిర్ణయాలు వికటిస్తాయి. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయొద్దు. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది. 

సింహం

తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. విందు వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

కన్య

లక్ష్యాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు కలుగుతాయి. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

తుల

అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృశ్చికం

బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మీమీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

ధనుస్సు

మీమీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకులిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. లక్ష్మీ దేవిని దర్శించుకోవడం మంచిది.

మకరం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది.

కుంభం

మీమీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. గతం కంటే మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తి వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.

మీనం

వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని