Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Updated : 22 Mar 2024 00:16 IST

మేషం

ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

వృషభం

ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా  ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దుర్గా ఆరాధన శుభప్రదం.

మిథునం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్య విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

కర్కాటకం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దుర్గ ఆరాధన శుభప్రదం.

సింహం

ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

కన్య

మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

తుల

శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. శ్రీఆంజనేయ దర్శనం  మంచిది.

వృశ్చికం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన చేయాలి.

ధనుస్సు

కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి.పెద్దల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం ఉత్తమం.

మకరం

మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కుంభం

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  

మీనం

ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని