Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...(03/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 03 Mar 2024 01:01 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోధైర్యం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్యప్రసక్తి వస్తుంది. కుటుంబసౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

ధర్మసిద్ధి ఉంది. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదవాలి.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేలా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

శుభకాలం. తృతీయ చంద్రసంచారం అనుకూలిస్తోంది. బుద్ధిబలంతో లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రుతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీదత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

ప్రారంభించిన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. పరిమితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ప్రారంభించిన పనులు సులువుగా పూర్తవుతాయి. కొన్ని కీలక వ్యవహారాల గురించి కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

 

శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

శారీరకశ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని