Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.   

Updated : 30 Nov 2023 06:45 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభకాలం. తృతీయ చంద్ర సంచారం అనుకూలిస్తోంది. బుద్ధిబలంతో లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల  మంచి జరుగుతుంది.

చేపట్టే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.  ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.

ధర్మసిద్ధి ఉంది. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకుసాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.  నవగ్రహ శ్లోకాలు చదవాలి.

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది.  కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని ముందడుగు వేయండి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యుతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.  బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు.  శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

 ఏ  పని తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.  ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణం చేయాలి.

 

శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని