Kavitha: కవితకు ఇంటి భోజనం.. పుస్తకాలు, జపమాలకు అనుమతి

తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలి రౌస్‌ అవెన్యూ కోర్టు జైలు అధికారులను మరోసారి ఆదేశించింది.

Published : 02 Apr 2024 00:05 IST

దిల్లీ: తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్‌ చేసుకునేందుకు, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని