Kadapa: ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదులను వైకాపా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు.

Published : 22 Apr 2024 16:54 IST

పొద్దుటూరు: వైయస్‌ఆర్‌ జిల్లా  ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదులను వైకాపా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక పురపాలక సంఘం కమిషనర్‌ రఘునాథరెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా... కూల్చివేత విషయం తనకు తెలియదని, టిడ్కో అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. అనంతరం తెదేపా నాయకులు కలెక్టర్ విజయరామరాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కూల్చివేతను చేపట్టినట్లు కలెక్టర్‌ వారికి వివరించారు. దీనిపై అసహనం వ్యక్తంచేసిన వరదరాజుల రెడ్డి.. గతంలో తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు టిడ్కో ఇళ్లను నిర్మించిందని, వాటిని కూల్చివేయడం దుర్మార్గమన్నారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని, ప్రొద్దుటూరులో స్థానిక ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్‌రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని