Vemulawada: వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు.

Updated : 27 May 2024 12:24 IST

వేములవాడ గ్రామీణం: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. కోడె మొక్కుల కోసం క్యూలైన్‌లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని