West Godavari: రూ.1.80 కోట్ల నగదుతో గంగానమ్మకు అలంకరణ

ప.గో జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీగంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 18 Oct 2023 17:03 IST

జంగారెడ్డిగూడెం: ప.గో జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీగంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో గంగానమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.80 కోట్ల నగదుతో అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఇవాళ గంగానమ్మకు అభిషేకాలు నిర్వహించారు. అలాగే సామూహిక కుంకుమ పూజలు, లలితా, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిగాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని