Amaravati: మంత్రి జోగి రమేశ్‌, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

తెలుగుదేశం సీనియర్‌నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా స్పందించారు.

Published : 04 Apr 2024 22:33 IST

అమరావతి: తెలుగుదేశం సీనియర్‌ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. మంత్రి జోగి రమేశ్‌, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా ఫిర్యాదు కాపీకి జత చేశారు. వీడియో ఆధారంగా జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. 

వాలంటీర్ల సేవల నిలిపివేతకు కారణమయ్యారంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైకాపా అధికారిక ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో చేసిన పోస్టుపై ఈనెల 1న వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దురుద్దేశంతో చంద్రబాబుపై చేసిన పోస్టు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ధ్రువీకరించిన ఈసీ వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన 48 గంటల్లో ఇరువురు నేతలు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని