Election Commission: పోస్టల్‌ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ

పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది.

Published : 30 May 2024 14:35 IST

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు