Andhra news: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది

Updated : 02 Apr 2024 19:56 IST

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు ఉన్నారు.

ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై కూడా వేటు వేశారు. ఐఏఎస్‌ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. ఈమేరకు ఈసీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ పంపింది. బదిలీ అయినవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5గంటల్లోగా బదిలీ చేయాలని, కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ముగ్గురు చొప్పున పేర్లను కమిషన్‌కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు