Ramoji Rao: రామోజీరావు మార్గనిర్దేశకుడు: ఎడిటర్స్‌ గిల్డ్‌ సంతాపం

Ramoji Rao: రామోజీరావు మృతికి ఎడిటర్స్‌ గిల్డ్‌ సంతాపం తెలియజేసింది. మీడియా రంగానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడింది.

Published : 08 Jun 2024 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు (88) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయనో మార్గనిర్దేశకుడని కొనియాడింది. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

‘‘ఎడిటర్స్‌ గిల్డ్‌ మాజీ అధ్యక్షుడు రామోజీరావు (Ramoji Rao) మరణం విచారకరం. మీడియా మెఘల్‌గా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రామోజీరావు ఎన్నో మార్గాల్లో మనందరికీ మార్గనిర్దేశకులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి. ఆయనో ఐకాన్‌. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి.. దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని ఎడిటర్స్‌ గిల్డ్‌ తమ ప్రకటనలో పేర్కొంది.

1987లో రామోజీరావు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని