Duck: ఈ బాతు ఈకలు బంగారంతో సమానం!
నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం.. అరుదు.. అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి.
ఇంటర్నెట్ డెస్క్: నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం.. అరుదు.. అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి తీసిన 800 గ్రాముల ఈకల ధర మార్కెట్‌లో రూ.3.71లక్షలు పలుకుతోంది.
ఎందుకంత ధర?
ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్ ఈ బాతు ఈకల్లోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా తేలికైనవిగా ఉండటంతోపాటు శరీరానికి ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. దీంతో ఖరీదైన దుస్తులు, బ్యాగులు, ఇతర వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బాతు ఈకలను సేకరించడం మొదలుపెట్టాయి. అలా వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్కో బాతు నుంచి అతి స్వల్ప మొత్తంలోనే ఈకలు లభిస్తాయి. అందుకే, ఎంత వీలైతే అంత ఎక్కువ ఈకలు సేకరించడం కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికైనా ముందుకొస్తున్నాయి.
స్థానికులకు ఉపాధి..
ఈడర్ పోలార్ బాతుల ఈకలకు డిమాండ్ పెరుగుతుండటంతో స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి ఆదాయ వనరులా మారింది. వారంతా ఈకలను సేకరించి కంపెనీలకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా బాతులు గుడ్లు పెట్టి పొదిగే సమయంలో ఈకలు రాలి కిందపడుతుంటాయి. వాటిని సేకరిస్తుంటారు. ఒక కిలో ఈకలను సేకరించాలంటే దాదాపు 60 బాతులు అవసరం. అయితే ఒకవేళ బాతులు వారికంట పడినా వాటికి హాని తలపెట్టరు. ఈకలు సేకరించిన తర్వాత బాతును వదిలేస్తారు. కొన్నాళ్లకు బాతుకు మళ్లీ ఈకలు వస్తాయి. ఇలా ఏడాదిలో మూడుసార్లు ఈకల సేకరణ వారికి ఓ ఉపాధిలో మారుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
Michael: సందీప్ కిషన్‌కు ఆ ఒక్కటి ‘మైఖేల్’తో వస్తుందనుకుంటున్నా: నాని
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (01/02/2023)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన