Errabelli dayakar: ప్రచారం అవాస్తవం.. జేపీఎస్‌లను చర్చలకు పిలవలేదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు

ప్రభుత్వాన్ని నియంత్రించాలని జేపీఎస్‌లు అనుకోవడం సరైన పద్ధతి కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సమ్మె విరమిస్తే.. జేపీఎస్‌ల విషయంలో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Updated : 11 May 2023 15:20 IST

హైదరాబాద్‌: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను (జేపీఎస్‌) రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరూ జేపీఎస్‌లను చర్చలకు పిలవలేదని తెలిపారు. కార్యదర్శులు ఫోన్‌లో తనకు సమస్యలు చెప్పుకొన్నారని.. వెంటనే సమ్మె విరమించాలని వారికి సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మరోసారి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

‘‘జేపీఎస్‌లు సమ్మె చేయడం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధం. సంఘాలు ఏర్పాటు చేసి సమ్మెలు చేస్తూ ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి జేపీఎస్‌లు బాండ్ రాసిచ్చారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ సమ్మెకు దిగిన తీరు సరైంది కాదు. జేపీఎస్‌లపై సీఎం కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. ప్రభుత్వాన్ని నియంత్రించాలని అనుకోవడం పద్ధతి కాదు. సమ్మె విరమిస్తే.. జేపీఎస్‌ల విషయంలో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. సమ్మెను విరమించి విధుల్లో చేరాలి’’ అని జేపీఎస్‌లకు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు